precautation మాస్క్ ధరించండి
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:38 PM
Wear a mask హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు.

మాస్క్ ధరించండి
హెచ్‌ఎంపీవీపై ఆందోళన వద్దు
డీఎంహెచ్ డాక్టర్ జీవనరాణి
విజయనగరం రింగురోడ్డు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో తీసుకున్న మాదిరిగానే ఇప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా మాస్క్ ధరించాలని తెలిపారు. వైరస్ అంత ప్రమాదకరం కాదని, ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు అదుపుచేసేందుకు జిల్లాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటు న్నట్టు చెప్పారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను కూడా పాటించినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, ప్రజలంతా సహకరించాలన్నారు. జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభిస్తామని, దీనికి ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీటీవో డాక్టర్ కె.రాణి, జిల్లా మలేరియా నివారణ అధికారి మణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.