మహిళలకు అండగా ఉంటాం
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:22 PM
మహిళలకు సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని, వారి భద్రత, రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు.
- ఎస్పీ మాధవరెడ్డి
- ఆకట్టుకున్న పోలీసు ‘ఓపెన్ హౌస్’
బెలగాం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మహిళలకు సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని, వారి భద్రత, రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా బెలగాంలోని పోలీస్ సమావేశ మందిరంలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాలపై అవగాహన కల్పించారు. వివిధ కేసుల దర్యాప్తుల్లో వినియోగించే సాంకేతికత, కమ్యూనికేషన్, బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ గురించి వివరించారు. డాగ్ స్క్వాడ్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏఎస్పీ అంకితా సురాన, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు, మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.