ఆక్రమిత స్థలాలను రెగ్యులర్ చేస్తాం
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:03 AM
ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను రెగ్యుల ర్ చేస్తామని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు తెలిపారు.

రామభద్రపురం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను రెగ్యుల ర్ చేస్తామని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. సుమారు 150 గజాల స్థలాన్ని ఉచితంగా రెగ్యులర్ చేస్తామని, 150 దాటిన స్థలాలకు ప్రభుత్వానికి కొంత రుసుం చెల్లించి రెగ్యులర్ చేసుకో వాలని తెలిపారు. అలాగే ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 6వేల 903 ఫిర్యాదులకు గానూ సుమారు 6వేల 37 ఫిర్యాదులు పరిష్కరించామని చెప్పారు. మిగిలిన వాటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతు న్నామని అన్నారు. గ్రామ సదస్సుల్లో వచ్చిన 11వేల 212 ఫిర్యాదుల్లో 10వేల 748 పరిష్కరించామన్నారు. అలాగే అర్హులైన వారందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, పంచాయతీలో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆకుల సులోచనారాణి పాల్గొన్నారు.