Share News

పటిష్ఠ ప్రజాస్వామ్యానికి ఓటు కీలకం

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:37 PM

Vote: The Key to a Strong Democracy పటిష్ఠ ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు ఎంతో కీలకమని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం పార్వతీపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పటిష్ఠ ప్రజాస్వామ్యానికి ఓటు కీలకం
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పటిష్ఠ ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు ఎంతో కీలకమని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం పార్వతీపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘ ఓటు హక్కు కాదు..మన బాధ్యత కూడా...నిజాయితీగా ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.’ అంటూ విద్యార్థులు ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఓటు హక్కు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో 7,81,898 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఉన్నత విద్య కోసం వేరే ప్రాంతాలకు వెళ్లేవారు సైతం ఓటరుగా నమోదు కావాలని సూచించారు. అనంతరం సీనియర్‌ సిటిజన్లను సత్కరించారు. యువ ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు అందించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్‌, వ్యాసరచన, డిబేట్‌, చిత్రలేఖనం, ఉపన్యాసం వంటి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, సమర్థవంతంగా పనిచేసిన బీఎల్‌ఎల్‌వోలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - Jan 25 , 2025 | 11:37 PM