Share News

ఉత్తర ద్వార దర్శనం..భక్తుల తన్మయం

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:24 AM

Uttara Dwara Darshanam: Devotees in Divine Bliss వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనానికి శుక్రవారం వేకువజామునే ఆలయాలకు చేరుకున్నారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.

ఉత్తర ద్వార దర్శనం..భక్తుల తన్మయం
సాలూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అలంకరణలో ఉత్సవ మూర్తులు

వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల బారులు

(పార్వతీపురం)

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనానికి శుక్రవారం వేకువజామునే ఆలయాలకు చేరుకున్నారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. జిల్లాకేంద్రం, పార్వతీపురం , సాలూరు, కురుపాం, పాలకొండలోని ప్రముఖ దేవాలయాలతో పాటు తోటపల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, పూలంగి, పల్లకి, ఊంజల్‌ సేవలు, సేవతిరువీధి మహోత్సవం నిర్వహించారు. కొన్నిచోట్ల దీపోత్సవం, సంగీతార్చన చేశారు. మొత్తంగా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

Updated Date - Jan 11 , 2025 | 12:24 AM