Share News

గుర్తు తెలియని మహిళ మృతి

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:49 PM

కొత్తవలస సంత సమీపంలోని జడ్పీ కల్యాణ మండపం వద్ద శుక్రవారం గుర్తుతెలియని మహిళ మృతి చెందింది.

గుర్తు తెలియని మహిళ మృతి

లక్కవరపుకోట (కొత్తవలస), జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస సంత సమీపంలోని జడ్పీ కల్యాణ మండపం వద్ద శుక్రవారం గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరు కుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో పం చాయతీ సిబ్బంది ద్వారా శ్మశానానికి తరలించి అంత్యక్రియలు చేయించారు. మృతురాలు కొంతకాలంగా భిక్షాటన చేసుకుని జీవనం సాగిస్తున్నట్టు పం చాయతీ సిబ్బంది తెలిపారు.

Updated Date - Jan 17 , 2025 | 11:49 PM