Trains రైళ్లు, బస్సులు కిటకిట
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:19 AM
సంక్రాంతి పండుగకు జిల్లాకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారు.

కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ
విజయనగరం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు జిల్లాకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్ ఉన్న వారికి ఇబ్బంది లేకపోయినా... రిజర్వేషన్ లేని వారికి మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. బస్సుల్లోనూ.. రైళ్లలోనూ నిలబడి గమ్యస్థానాలకు పయనమవుతున్నారు. రిజర్వేషన్ భోగిల్లో మరుగుదొడ్ల వద్ద కొందరు కూర్చొని... కొందరు నిలుచొని వెళుతున్నారు. శుక్రవారం విజయనగరం మీదుగా వెళ్లే రైళ్లు, విజయనగరం నుంచి విజయవాడ, హైదరాబాద్, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్టణం, అనకాపల్లి, తుని, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో నిలబడి ప్రయాణం చేశారు. కొన్ని రైళ్లలో జనరల్ భోగీలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయి.