Share News

వృత్తి నైపుణ్యం పెంపునకు శిక్షణ

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:22 AM

పట్టణంలో పలు వృత్తులలో ఉంటూ జీవనం సాగిస్తున్న వారికి మరింత వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు మూడు నెలల ఉచిత శిక్షణ ఇస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి తెలిపారు.

వృత్తి నైపుణ్యం పెంపునకు శిక్షణ

బొబ్బిలి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో పలు వృత్తులలో ఉంటూ జీవనం సాగిస్తున్న వారికి మరింత వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు మూడు నెలల ఉచిత శిక్షణ ఇస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సి పల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ఆమె పట్టణంలో గల అన్ని రకాల సర్వీసు ప్రొవైడర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్‌, ప్లంబింగ్‌, బ్యూటీషియన్‌, సెలూన్‌, కార్పెంటర్‌, ఫ్రిజ్‌, కూలర్‌, ఏసీ, టీవీ వంటి వాటి మరమ్మతులకు సంబంధించి మరింత నైపుణ్యం పెంచడమే ఈ శిక్షణ లక్ష్యమన్నారు. వెయ్యి రూపాయ ల ప్రవేశ రుసుం చెల్లించి మూడు నెలల శిక్షణకు విజయనగరం వెళ్లేందుకు సిద్ధం కావాలని ఆమె తెలిపారు. శిక్షణ అనంతరం డ్రెస్‌ కోడ్‌, గుర్తింపు కార్డు ఇస్తారన్నారు. హోమ్‌ ట్రయాంగల్‌ యాప్‌లో పేర్లను నమోదు చేసుకుంటే ఆన్‌లైన్‌ సమాచారం అందుకుని ఇళ్లకు వెళ్లి సర్వీసు అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్‌వో ఎం.జగన్మోహ నరావు, సీఎంఎం ఎం.లలిత, సీవోలు పోలినాయుడు, సింహాచలం, అరుణజ్యోతి, వరలక్ష్మి, ఆర్పీలు, సర్వీసు ప్రొవైడర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:23 AM