Share News

ఆరోగ్య సమస్యలపై సకాలంలో స్పందించాలి

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:34 AM

వైద్య సిబ్బంది ఆరోగ్య సమస్యలపై సకాలంలో స్పందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహనరావు సూచించారు.

ఆరోగ్య సమస్యలపై సకాలంలో స్పందించాలి

కొమరాడ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది ఆరోగ్య సమస్యలపై సకాలంలో స్పందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహనరావు సూచించారు. చంద్రంపేట గ్రామాన్ని ఆయన గురువా రం సందర్శించారు. ఆరోగ్య సర్వేలు చేపడుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రస్తుతం కొనసాగుతున్న లెప్రసీ, ఎన్సీడీ, స్కూల్‌ హెల్త్‌, అంగన్‌వాడీ సర్వే, స్ర్కీనింగ్‌ ఏ మేరకు పూర్తి చేశారో ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. వారికి అం దుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కిల్కారీ మొబైల్‌ సేవలపై అడిగి తెలుసుకున్నారు. పిల్లల టీకా తేదీలను కార్డులో తనిఖీ చేసి వైద్య సిబ్బంది సూచనలు చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యారు ్థలతో మాట్లాడి ఐరన్‌ ఫోలిక్‌ ఆసిడ్‌ మాత్రలు వేయిస్తున్నారా అని అడిగారు. ఈ కార్యక్రమంలో ఎపెడి మిక్‌ ఈవో సత్తిబాబు, సూపర్‌వైజర్‌ నిర్మల, వైద్య సిబ్బం ది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:34 AM