Maha Shivratri: శివ పూజకు వేళాయే
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:23 AM
Maha Shivratri: శివరాత్రి పర్వదినానికి జిల్లాలోని ప్రముఖ ఆల యాలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలంకర ణతో శోభాయమానంగా కనిపిస్తున్నాయి.

- నేడు మహా శివరాత్రి
-ముస్తాబైన శైవ క్షేత్రాలు
విజయనగరం ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): శివరాత్రి పర్వదినానికి జిల్లాలోని ప్రముఖ ఆల యాలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలంకర ణతో శోభాయమానంగా కనిపిస్తున్నాయి. లింగోద్భవ సమయంలో శివయ్యను ఆరాదిస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. రాత్రి 11.30 నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్య లింగోద్భవ కాలంగా భావిస్తారు. శివరా త్రి రోజున శివున్ని ఆరాదించి, ఆ రాత్రంతా జాగారం చేసి, శివనామాలు, కీర్తనలు జపించి ఉదయాన్నే శివుడికి పంచామృతాభిషేకాలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నా యి. బుధవారం శివాలయాలకు భారీగా భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జిల్లాలోని పుణ్యగిరి, ధర్మవరం సన్యాశేస్వ రాలయం, జయతి శివాలయంతో పాటు విజయనగరం, బొబ్బిలి, నెల్లిమ ర్ల, గజపతినగరం తదితర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పూజలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, క్యూలైన్లు, తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంబే డ్కర్ అధికారులకు ఆదేశించారు. పుణ్యగిరి, నెల్లిమర్ల తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో క్యూలైన్లు, పార్కింగ్ ఏర్పాట్లను ఎస్పీ వకూల్ జిందాల్ మంగళవారం పర్యవేక్షించారు.