Share News

వసతిగృహాలపై పర్యవేక్షణ ఉండాలి

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:21 AM

జిల్లాలోని వసతిగృహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించా రు.

వసతిగృహాలపై పర్యవేక్షణ ఉండాలి

బెలగాం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వసతిగృహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించా రు. గురువారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయ చాంబర్‌లో వసతిగృహాల పనితీరుపై ఆ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వసతిగృహాల్లో మెనూ ప్రకారం సక్రమంగా, నాణ్య మైన భోజనం అందిస్తున్నది లేనిదీ సహాయ సంక్షేమాధికారులు తనిఖీలు నిర్వహించి నివేదిక లు అందజేయాలని ఆదేశించారు. విద్యాబోధన, తాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణపై తనిఖీ చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య కార్యకర్తల పనితీరుపై తనిఖీలు నిర్వహించాల న్నారు. వసతిగృహాల్లో కారిడార్‌ వద్ద ఆవరణలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా నిఘా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ చంద్రబాబు, జిల్లా షెడ్యూల్‌ కులాల సంక్షేమ సాధికారిత అధికారి ఎండీ గయాజుద్దీన్‌, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎస్‌.కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:21 AM