వైద్యుడు లేరు.. సిబ్బంది కరువు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:50 PM
గరివిడి పీహెచ్‌సీలో గల ఆయుష్ క్లినిక్‌కు రెండేళ్లుగా వైద్యాధికారితోపాటు సిబ్బంది లేకపోవడంతో హోమియో మందులు వినియోగిస్తున్న రోగులు ఇబ్బందిపడుతున్నారు.

గరివిడి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): గరివిడి పీహెచ్‌సీలో గల ఆయుష్ క్లినిక్‌కు రెండేళ్లుగా వైద్యాధికారితోపాటు సిబ్బంది లేకపోవడంతో హోమియో మందులు వినియోగిస్తున్న రోగులు ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ వైద్యాఽ దికారిగా విధులు నిర్వహించి డి.వెంకటమధు రెండు సంవత్సరాల కిందట గుర్ల మండలానికి బదిలీపై వెళ్లిపోయిన విషయంవిదితమే. అప్ప టినుంచి ఇంతవరకు సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం ఏ ఒక్కరిని వైద్యాధికారిగా నియ మించలేదు. వైద్యాధికారితోపాటు కంపౌండర్, అటెండర్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్లినిక్‌కు ఉండాలి. కానీ రెండేళ్లుగా ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేకపోవడం గమనార్హం. వైద్యాధికారి అందుబాటులో ఉన్న సమయంలో రోజుకు సుమారు 50 మంది వరకు బీపీ, షుగ ర్ తదితర దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు హోమియో వైద్యం కోసం పీహెచ్‌సీకి వస్తుండేవారు. అయితే వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో హో మియో మందులు వాడే రోగులు గుర్ల, చీపు రుపల్లి మండలాలకు వ్యయప్రయాశలు పడి వెళ్లాల్సివస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఓపీ ఉన్నా...
గరివిడి పీహెచ్‌సీలో గల ఆయుష్ క్లినిక్‌కు ప్రతిరోజూ 50 మంది వరకూ సేవలు పొం దేందుకు వస్తుంటారు. గరివిడి మండలంలోని కోడూరు, తాటివాడ, గెడ్డవలస, కేఎల్‌పురం తదితర 30 పంచాయతీల నుంచి ఇటీవల ఆయుష్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వైద్యాధికారి, సిబ్బంది లేకపోవడంతో మూడు కిలోమీటర్లు దూరం లోని చీపురుపల్లి, ఐదు కిలోమీటర్ల దూరంలో గుర్ల ఆయుష్ సేవలకు వెళ్లాల్సివస్తోందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆయు ష్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వైద్యా ధికారి, సిబ్బందిని తక్షణమే నియమించాలని పలువురు కోరుతున్నారు.