Share News

మూడో వారమూ.. జన ప్రవాహమేమూడో వారమూ.. జన ప్రవాహమే

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:07 AM

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మూడో వారం జాతర మంగళవారం వైభవంగా జరిగింది.

మూడో వారమూ.. జన ప్రవాహమేమూడో వారమూ.. జన ప్రవాహమే
అమ్మవారి దర్శనానికి ఎండలో భక్తుల బారులు

సాలూరు (మక్కువ), ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మూడో వారం జాతర మంగళవారం వైభవంగా జరిగింది. తెల్లవారు జాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. తొలి, మారువారం జాతరలకు మించి భక్తులు మూడో వారం జాతరకు చేరుకోవడంతో చదురుగుడి, వనంగుడి వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు నిండిపోయాయి. దీనితో భక్తులు గోముఖి నది వంతెన వరకు ఎండలోనే అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. చదురు గుడిలో పోలమాంబను దర్శించుకు నేందుకు భక్తులు ఓపికతో వేచి చూశారు. వేపచెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గోముఖి నదీ తీరాన అమ్మవారికి తలనీలాలు సమర్పించారు. కోళ్లు, చీరలు, మొక్కులు చెల్లించుకున్నారు. వనం గుడి సమీప ప్రాంతాల్లో చెట్ల కింద వంటా వార్పూ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ ఈవో వి.వి.సూర్యనారాయణ ఏర్పాట్లు చేశారు. సాలూరు రూరల్‌ సీఐ రామకృష్ణ, మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Feb 12 , 2025 | 12:07 AM