Share News

గజరాజుల బీభత్సం

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:10 AM

మండలంలో నాగావళి నది ఆవల వైపు ఉన్న పూజారిగూడ సమీపంలో పంటలను, వ్యవసాయ పరిక రాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది.

 గజరాజుల బీభత్సం

కొమరాడ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో నాగావళి నది ఆవల వైపు ఉన్న పూజారిగూడ సమీపంలో పంటలను, వ్యవసాయ పరిక రాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. శుక్రవారం రాత్రి, శనివారం ఏనుగుల గుంపు పంటపై పడి నాశనం చేశాయి. పామాయిల్‌ మొక్కలను పీకివేశాయని, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను ధ్వంసం చేశాయని రైతు దత్తి రామ్మూర్తినాయుడు లబోదిబోమంటున్నారు. తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని ఆయన కోరారు.

Updated Date - Mar 09 , 2025 | 12:10 AM