Share News

సెల్‌ టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:14 AM

పెదతోలుమండ గ్రామంలో గల సెల్‌ టవర్‌ ఎక్కి ఒక వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం హల్‌చల్‌ చేశాడు.

సెల్‌ టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌
పోలీసుల అదుపులో మతిస్థిమితం లేని వ్యక్తి

జియ్యమ్మవలస, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పెదతోలుమండ గ్రామంలో గల సెల్‌ టవర్‌ ఎక్కి ఒక వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం హల్‌చల్‌ చేశాడు. గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు జియ్యమ్మవలస ఎస్‌ఐ పి.ప్రశాంత్‌ కుమార్‌, చినమేరంగి ఎస్‌ఐ పి.అనీష్‌, పోలీస్‌ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. టవర్‌ ఎక్కిన వ్యక్తి ఈ రాష్ట్రం వాడు కాదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. హిందీ వచ్చిన హోంగార్డు పి.సూర్యనారాయణతో మాట్లాడించారు. మూడు గంటలు శ్రమించిన అనంతరం ఆ వ్యక్తిని కిందకు దిగేలా చేశారు. అతని వివరాలు కనుక్కునే ప్రయత్నంలో భాగంగా మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. తనది మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర అంటూ రాష్ట్రాల పేర్లు చెబుతున్నాడని ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌కు తరలించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 03 , 2025 | 12:14 AM