హిందూ ధర్మరక్షణే ధ్యేయం
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:21 AM
హిందూ ధర్మరక్షణే ధ్యేయమని త్రిదండి చిన జియర్ స్వామి తెలిపారు. బుధవారం పార్వతీపురం టౌన్ పోలీసు స్టేషన్ వీధిలో గల ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో తీర్ధగోష్టి కార్యక్రమం నిర్వహించారు.
పార్వతీపురంటౌన్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మరక్షణే ధ్యేయమని త్రిదండి చిన జియర్ స్వామి తెలిపారు. బుధవారం పార్వతీపురం టౌన్ పోలీసు స్టేషన్ వీధిలో గల ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో తీర్ధగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న జియ్యర్ స్వామి మా ట్లాడుతూ ఆధ్యాత్మిక, భక్తిమార్గం ద్వారా ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. కాగా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ దంపతులకు ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో వికాసతరంగిణి పార్వతీపురంశాఖ అధ్యక్షుడు ఐ.గున్నేష్, తదితరులు పాల్గొన్నారు.