Share News

మినీ గోకులాలు ప్రారంభం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:12 AM

పశు సంపదను సంరక్షించే విధం గా కూటమి ప్రభుత్వం గోశాలలను నిర్మిస్తోందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

మినీ గోకులాలు ప్రారంభం

  • పశు సంపద సంరక్షణకు ప్రభుత్వం చర్యలు: విప్‌ జగదీశ్వరి

  • గ్రామాభివృద్ధి కోసమే పల్లె పండుగ: పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర

గుమ్మలక్ష్మీపురం, జనవరి 11 (ఆంధ్ర జ్యోతి): పశు సంపదను సంరక్షించే విధం గా కూటమి ప్రభుత్వం గోశాలలను నిర్మిస్తోందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ కలిగొట్టు గ్రామంలో, గుమ్మలక్ష్మీపురంలోని కొండవీధిలో, డుమ్మంగి పంచాయతీ గుణద గ్రామాల్లో ఉపాధి నిధులతో నిర్మించిన గోశాలలను ఆమె శనివారం ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ పాడి సుదర్శనరావు, ఎంపీడీవో సాల్మన్‌రాజు, జనసేన సమన్వ యకర్త కడ్రక మల్లేశ్వరరావు, డీటీ శేఖర్‌, సర్పంచ్‌ క్రాంతి పాల్గొన్నారు.

కురుపాం: మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన గోకులాలను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. ఎంపీడీవో యు.ఉమామహేశ్వరి, ఉపాధి ఏపీవో పి.బావాజీ, ఈవోపీ ఆర్డీ రమేష్‌, టీడీపీ మండల కన్వీనర్లు కేవీ కొండయ్య, పాడి సుధ, మాజీ ఎంపీపీ జీవీ రమణమూర్తి, జనసేన మండల అధ్యక్షుడు ఎన్‌.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బొబిలి రూరల్‌: మండలంలోని 12 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం, పశు సంవర్థక శాఖ సమన్వయంతో నిర్మించిన మినీ గోకులం షెడ్లను శనివారం ప్రారంభించారు. పారాది సచివాలయం పరిధి బంకురువలస గ్రామంలో పశు సంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎల్‌.విష్ణు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎ.భాస్కరరావు సమక్షంలో గోకులం షెడ్‌ను ప్రారంభించారు. ఎంపీడీవో పి.రవికుమార్‌, ఏపీవో లక్ష్మీపతిరాజు, ఈవోపీఆర్డీ ఎ.భాస్కరరావు, టెక్నికల్‌ సహాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రామభద్రపురం: ముచ్చర్లవలస గ్రామంలో నిర్మించిన గోకులాన్ని ఎంపీటీసీ సభ్యురాలు మడక స్వర్ణలత శనివారం ప్రారంభించారు. ఎంపీడీవో రత్నం, ఏపీవో గొలగాని త్రినాథరావు పాల్గొన్నారు.

సీతానగరం: గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమాన్ని అమలు చేసిందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పల్లె పండుగలో భాగంగా చిన్నరాయుడుపేటలో నిర్మించిన మినీ గోకులాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. పశు వైద్యాధికారి రామారావు, టీడీపీ నాయకులు రౌతు వేణుగోపాల్‌నాయుడు, పెంట సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురం: నర్సిపురం పంచాయతీ విశ్వంభరాపురంలో మినీ గోకులాలను టీడీపీ నాయకుడు గొట్టాపు వెంకటర మణ, ఎంపీటీసీ సభ్యుడు తవిటినాయుడు శనివారం ప్రారంభించారు. సర్పంచ్‌ బంగారమ్మ పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: ఎంఆర్‌ నగరంలో నిర్మించిన గోశాలలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం ప్రారంభించారు. టీడీపీ నాయకులు బోనుదేవి చంద్రమౌళి, గొట్టాపు వెంకటనాయుడు, వంగపండు త్రినాథనాయుడు, సర్పంచ్‌ వంగపండు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

గరుగుబిల్లి: చిలకాం పంచాయతీ పరిధిలో నిర్మించిన గోశాలలను టీడీపీ బీసీ సెల్‌ అరకు పార్లమెంటరీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ శనివారం ప్రారంభించారు.

Updated Date - Jan 12 , 2025 | 12:12 AM