ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:31 AM
ప్రజా సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

పార్వతీపురం రూరల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శు క్రవారం నర్సిపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరిం చారు. వీఆర్‌ఎస్ ప్రాజక్టు ద్వారా సీతానగరం మండలంలో కోట సీతా రాంపురం, పి.బుచ్చంపేట, జాను, మల్లువలస, గాజులవలస గ్రామాలకు సాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందించారు. సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.