Share News

ఇంజనీరు హత్య బంధువుల పనే?

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:11 AM

The engineer's murder is the work of the relatives? తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు కోనారి ప్రసాద్‌ హత్యకేసులో కొత్త అంశాలను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితులను గుర్తించి హత్యకు కారణాలను దాదాపు సేకరించినట్లు తెలిసింది. ప్రధానంగా వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగింది.

ఇంజనీరు హత్య బంధువుల పనే?
ఘటనా స్థలం నుంచి కర్రలను సేకరిస్తున్న సీఐ నారాయణరావు

ఇంజనీరు హత్య బంధువుల పనే?

కేసులో కొత్త కోణాలు

వివాహేతర సంబంధమే కారణమా?

పోలీసు దర్యాప్తుల్లో వెలుగులోకి పలు అంశాలు

తెర్లాం/బొబ్బిలి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):

తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు కోనారి ప్రసాద్‌ హత్యకేసులో కొత్త అంశాలను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితులను గుర్తించి హత్యకు కారణాలను దాదాపు సేకరించినట్లు తెలిసింది. ప్రధానంగా వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగింది. పూర్తి వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించే అవకాశం ఉంది. ప్రసాద్‌ స్వగ్రామానికి చెందిన సమీప బంధువులైన ఇద్దరు అన్నదమ్ములే ప్రసాద్‌ను కర్రలతో కొట్టి చంపేశారని, ఆ తరువాత రోడ్డుపైకి ఈడ్చుకుని తెచ్చి పడేసినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఓ వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండడం వల్లే ప్రసాద్‌ను చంపేశామని పోలీసుల దర్యాప్తులో నిందితులు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

- ఈ నెల 10న రాత్రి ప్రసాద్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బొబ్బిలి డీఎస్‌పి జి.భవ్యారెడ్డి ఆధ్వర్యంలో బొబ్బిలి రూరల్‌ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు బృందం కేసును ఛేదించే పనిలో ఉన్నారు. అన్ని రకాల ఆధారాలను సేకరించారు. తమకు తెలిసిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి లోతుగా విచారించారు. ఆపై వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. హత్యాస్థలంలో ఉన్న కర్రలను పోలీసులు గురువారం వెళ్లి సేకరించారు. హతుడి మొబైల్‌ ఫోన్‌ను ధ్వంసం చేసి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేయడంతో పోలీసులు నీటిని తోడించి ఫోన్‌ను సేకరించారు. నిందితుని భార్య నుంచి కూడా పోలీసులు వాంగ్మూలాన్ని సేకరించారు. ఆమెకు కంప్యూటర్‌ పరిజ్ఞానం కల్పించడలో ప్రసాద్‌ సహకరించినట్లు తెలిసింది. భర్త అనుమతితోనే ప్రసాద్‌ ఆమెకు శిక్షణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా ఈ కేసులో అనేక అంశాలు ఉన్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. రెండో నిందితునిగా ఉన్న యువకుడు గ్రూపు-2 పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. హత్యకేసు వివరాలను ఎస్పీ వకుల్‌జిందాల్‌ శుక్రవారం సమగ్రంగా వివరిస్తారని సీఐ కె.నారాయణరావు తెలిపారు.

Updated Date - Feb 14 , 2025 | 12:11 AM