ఉపాధ్యాయురాలి మృతి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:26 AM
మండలంలోని కనిమెట్టలో జాతీయరహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బి.సౌజన్య దుర్మరణం చెందారు.

పూసపాటిరేగ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కనిమెట్టలో జాతీయరహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బి.సౌజన్య దుర్మరణం చెందారు. మృతురాలు భోగాపురం మండలం లోని పోలిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యా యురాలిగా పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంఽధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలో నివాసం ఉంటున్న సౌజన్య.. భర్త కింగువ రవికుమార్, ఇద్దరు పిల్లలు, అత్త భోగి భవానీతో గతనెల 27న కారులో కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఆదివారం తెల్లవారుజామున కనిమెట్ట వద్ద విశాఖ వైపు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొంది. దాంతో డ్రైవర్ వెనుకవె ౖపు కూర్చొన్న సౌజన్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. డ్రైవర్, భవానీలకు గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంపై జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.