Share News

రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:15 AM

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపారని సీపీఎం నాయకులు ఆరోపించారు.

 రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న దృశ్యం

బెలగాం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపారని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విద్యా సంస్థలకు, పరిశ్రమలకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. రాజధాని అమరావతికి గతంలో ప్రపంచ బ్యాంకు ఇచ్చిన అప్పు తప్ప అదనంగా ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు, మెట్రో ప్రాజెక్టులకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఎటువంటి నిధులు ఇవ్వలేదన్నారు. సీపీఎం నాయకులు దావాల రమణరావు, ఉమా మహేశ్వరి, సూరిబాబు పాల్గొన్నారు.

రాష్ట్రానికి ద్రోహం

పాలకొండ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసింద ని సీపీఎం నాయకుడు దావాల రమణారావు విమర్శించా రు. ఆయన ఆదివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. గిరిజన యూనివర్శిటీ, ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, కడప ఉక్కు పరిశ్రమకు కనీసం కేటాయింపులు ఈ బడ్జెట్‌లో చేయలేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గతం కంటే తక్కువ కేటాయింపులు చేశారన్నారు. జిల్లాల అభివృద్ధికి కేటాయించాల్సిన కేటాయింపులు కూడా ఈ బడ్జెట్‌లో చేయలేదని విమర్శించారు. సీపీఎం నాయకులు కాద రాము, దూసి దుర్గారావు, భానుచందర్‌, లక్ష్మణరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:15 AM