ఉపాధ్యాయుడి సస్పెన్షన్
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:19 AM
సీతంపేట ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మండంగి నాగేశ్వర రావును సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా విద్యా శాఖాధికారి ఎన్.తిరుపతినాయు డు గురువారం ఆదేశాలు జారీ చేశారు.

సీతంపేట రూరల్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మండంగి నాగేశ్వర రావును సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా విద్యా శాఖాధికారి ఎన్.తిరుపతినాయు డు గురువారం ఆదేశాలు జారీ చేశారు. నాగేశ్వర రావు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై గత నెలలో వారి తల్లిదండ్రులు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నాగేశ్వరరావు తోపాటు నైట్ వాచ్ మన్ పి.త్రినాథరావుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి ఆదేశాల మేరకు పాలకొండ డిప్యూటీ ఈవో ఇటీవల విచారణ చేపట్టారు. విచార ణ నివేదిక ఆధారంగా చేసుకుని సదరు ఉపా ధ్యాయుడు ఎం.నాగేశ్వర రావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాచ్‌మన్ కూడా విధుల నుంచి తొలగించినట్టు ఆదేశాలు వచ్చాయి.