Swarna Andhra : స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం కావాలి
ABN , Publish Date - Jan 19 , 2025 | 12:22 AM
Swarna Andhra: స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్
జియ్యమ్మవలస, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కుదమ పంచాయతీ పెదకుదమలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ చీపురు పట్టుకొని వీధులను ఊడ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా 3వ శనివారం కచ్చితంగా ఈ కార్యక్రమం జరగాలన్నారు. రాష్ట్రంలోనే జిల్లాను పరిశుభ్రతలో అగ్రగామిగా నిలపాలన్నారు. ఇంటింటా నూరు శాతం చెత్త సేకరణ జరగాలన్నారు. దానిలో తడి చెత్త, పొడి చెత్త వేరే చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెత్త కుప్పలు లేని సమాజం తయారు చేయడమే మన లక్ష్యమన్నారు. శత శాతం ఓడీఎఫ్ ప్లస్ ఆదర ్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం మన బాధ్యత కావాలని అన్నారు. ముఖ్యంగా మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రామచంద్రరావు, అరకు పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, వట్టిగెడ్డ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సత్యంనాయుడు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.