colocter worning పనితీరు మెరుగుపడకపోతే సస్పెన్షన్
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:13 AM
Suspension if performance does not improve పనితీరు మెరుగుపర్చుకోకపోతే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. ఇన్నాళ్లూ హెచ్చరికలకే పరిమితం అయ్యాయని, ఇక నుంచి చర్యలు మొదలు పెడుతున్నామన్నారు.

పనితీరు మెరుగుపడకపోతే సస్పెన్షన్
పీఆర్ ఇంజినీర్లపై ఆగ్రహించిన కలెక్టర్ అంబేడ్కర్
నలుగురిపై చర్యలకు ఆదేశం
విజయనగరం కలెక్టరేట్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పనితీరు మెరుగుపర్చుకోకపోతే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. ఇన్నాళ్లూ హెచ్చరికలకే పరిమితం అయ్యాయని, ఇక నుంచి చర్యలు మొదలు పెడుతున్నామన్నారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు, గోకులాలు తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బొబ్బిలి పీఆర్ ఏఈ సస్పెన్షన్‌కు, సంబంధిత డీఈ, ఇద్దరు ఏపీవోలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఉపాధి హామీ మెటిరియల్ కాంపోనెంట్ కింద సుమారు రూ.280 కోట్ల విలువైన సీసీ, బీటీ రోడ్లు, డ్రైన్లు తదితర 2,851 పనులను మూడు దశల్లో మంజూరు చేశామన్నారు. వీటిల్లో 1171 పనులను మాత్రమే పూర్తి చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు నెలల్లో కేవలం 40 శాతం పనులే చేశారని, నిధుల వినియోగం మరింత అధ్వానంగా ఉందన్నారు. నిధులు వినియోగించకపోతే జిల్లా ప్రజలు నష్టపోతారని చెప్పారు. ఇన్‌చార్జి ఏఈలు ఉన్న చోట ఇంజినీరింగ్ అసిస్టెంట్లను నియమించుకోవాలని సూచించారు. సమావేశంలో పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాస్, డ్వామా పీడీ శారదాదేవి తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్‌లో ప్రతిరోజూ వినతుల స్వీకరణ
ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించే కౌంటర్‌ను బుధవారం రాత్రి జేసీ సేతుమాధవన్ ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలను ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ అందజేయవచ్చు. కలెక్టరేట్ పోర్టికో వద్ద దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ తరహా కౌంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఈ దేవి ప్రసాద్, ఎలక్షన్ సూపరింటెండెంట్ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
------------