క్రీడా‘రాణులు’
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:51 PM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని రాజీవ్‌క్రీడా ప్రాంగణంలో శుక్రవారం మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు.

- ఆటపాటలతో సందడి చేసిన ఉద్యోగినులు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహణ
- స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఆర్డీవో కీర్తి
విజయనగరం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని రాజీవ్‌క్రీడా ప్రాంగణంలో శుక్రవారం మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఏపీ ఎన్జీవో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మహిళా ఉద్యోగులు పాల్గొని సందడి చేశారు. ముఖ్య అతిథిగా ఆర్డీవో డి.కీర్తి హాజరయ్యారు. జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళలు ఒకపక్క ఉద్యోగాలు చేస్తూ.. మరో గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, షటిల్ బ్యాడ్మింటన్, మ్యూజికల్ చైర్స్ వంటి క్రీడలు ఆడారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో ప్రతినిఽధులు డీవీ రమణ, శ్రీధర్‌బాబు, సురేష్, కిషోర్, ఆనందకుమార్, మహిళా విభాగం ప్రతినిధులు ఆదిలక్ష్మి, స్వప్న, రాధిక, తదితరులు పాల్గొన్నారు.