పాఠశాలలను హేతుబద్ధీకరించాలి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:11 AM
జీవో- 117కు సవరణగా జారీచేసిన మెమో ప్రకారంపాఠశాలల హేతుబద్ధీకరణ జరగాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జేసీ రాజు కోరారు.

బొబ్బిలి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): జీవో- 117కు సవరణగా జారీచేసిన మెమో ప్రకారంపాఠశాలల హేతుబద్ధీకరణ జరగాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జేసీ రాజు కోరారు. ఆదివారం బొబ్బిలిలో ఏపీటీఎఫ్ నాయకులతో సమావేశం నిర్వహిం చారు.ఈసందర్భంగా జేసీరాజు మాట్లాడుతూ మెమోలో పేర్కొన్న ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 60కి మించి ఉన్న పాఠశాలలను ఉన్నతీక రించాలని కోరారు. ప్రాఽథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 మించి ఉంటే ఆదర్శప్రాథమిక పాఠశాలలుగా మార్పుచేయాలని మెమోలో సూచించారని,దీనికి భిన్నం గా వసతులులేవని కారణం చూపుతూ విలీనం చేస్తున్నా రన్నారు.సంఘ జిల్లా గౌరవాధ్యక్షులు జోగినా యుడు మా ట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల విద్యలో ప్రవేశపె ట్టాలని భావిస్తున్న సంస్కరణలు విద్యార్థులకు నాణ్య మైన విద్యనందించేవిగా ఉండాలని కోరారు. సమావే శంలో సీహెచ్ ప్రవీణ్‌కుమార్, కుందా శ్రీను, రామకృష్ణ, ఎల్లయ్య, ప్రసాద్, శర్మ, జేబీ దర్శనం, బండి రమేష్, లక్ష్మణరావు పాల్గొన్నారు.