Share News

sand is evaliable but not found reach నిల్వలున్నా.. రీచ్‌ల్లేవెందుకో!

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:19 AM

sand is evaliable but not find reach రేగిడి మండలంలో సువిశాలమైన నాగావళి నదీ తీరం ఉంది. చాలాచోట్ల లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇక్కడరీచ్‌ల కేటాయింపునకు అవకాశం ఉన్నా జిల్లా యంత్రాంగం ఆ దిశగా ఆలోచించడం లేదు.

sand is evaliable but not found reach నిల్వలున్నా.. రీచ్‌ల్లేవెందుకో!
మైనింగ్‌శాఖ పరిశీలించిన వెంకటాపురం ఇసుకరీచ్‌ ఇదే

నిల్వలున్నా.. రీచ్‌ల్లేవెందుకో!

అడ్డదారుల్లో తరలిపోతున్న ఇసుక

అనధికారికంగా తవ్వకాలు

సహకరిస్తున్న అధికారులు

రేగిడి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రేగిడి మండలంలో సువిశాలమైన నాగావళి నదీ తీరం ఉంది. చాలాచోట్ల లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇక్కడరీచ్‌ల కేటాయింపునకు అవకాశం ఉన్నా జిల్లా యంత్రాంగం ఆ దిశగా ఆలోచించడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. అనధికారిక క్వారీల్లో ఇసుక తవ్వకాలు చేపట్టి అడ్డదారుల్లో తరలించుకు పోతున్నారు. పక్క మండలాల్లో అధికారిక రీచ్‌లు ఉన్నా అక్కడకు వెళ్లడంలేదు. అక్కడకు వెళ్లాలంటే దూర భారంతో పాటు రవాణా ఖర్చులు తడిసిమోపుడు అవుతున్నాయని అనధికారిక రీచ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. మండలంలోని బొడ్డవలస ఆవలి ఒడ్డున ఉన్న మన్యం జిల్లా గోపాలపురం నదీతీర ప్రాంతం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అదే విధంగా వెంకటాపురం, తునివాడ, కందిశ, కొమిర, ఖండ్యాం తదితర రేవుల్లోనూ ఈ దందా నడుస్తోంది. యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంది.

రీచ్‌ల గుర్తింపులో జాప్యం

వైసీపీ ప్రభుత్వంలో వెంకటాపురం, తునివాడ, కందిశ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉండేవి. అప్పట్లో వెంకటాపురం రీచ్‌ నుంచి కొన్ని లక్షల టన్నుల ఇసుకను అనాధికారికంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రేవుల్లో ఇప్పటికీ కొన్ని లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. అయినా రీచ్‌లను గుర్తించడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇసుకాసురులను పెంచి పోషించేందుకే అన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఈ రీచ్‌లను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ చిన్నారావును వివరణ కోరగా.. ‘వెంకటాపురం ఇసుక రీచ్‌ను మైనింగ్‌ అధికారులు రెండుసార్లు తనిఖీ చేసి వెళ్లారు. ఇక్కడ విరివిగా ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. స్టాక్‌ పాయింట్‌ కోసం సర్వే చేశారు’ అని తెలిపారు.

Updated Date - Mar 09 , 2025 | 12:19 AM