Share News

elephant పొలాల్లో సంచారం.. పంటలు ధ్వంసం

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:35 PM

Roaming in Fields... Crops Destroyed భామిని మండలం ఘనసరలో గజరాజులు హల్‌చల్‌ చేస్తున్నాయి. పొలాల్లో సంచరిస్తూ స్థానికులను హడలెత్తిస్తున్నాయి. సోమవారం ఆ గ్రామంలోని మొక్కజొన్న పంట, నాలుగు మోటార్లను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు.

elephant  పొలాల్లో సంచారం.. పంటలు ధ్వంసం
ఘనసర పంట పొలాల్లో ఏనుగులు

భయాందోళనలో ప్రజలు, రైతులు

భామిని, ఫిబ్రవరి 17 (ఆంరఽధజ్యోతి): భామిని మండలం ఘనసరలో గజరాజులు హల్‌చల్‌ చేస్తున్నాయి. పొలాల్లో సంచరిస్తూ స్థానికులను హడలెత్తిస్తున్నాయి. సోమవారం ఆ గ్రామంలోని మొక్కజొన్న పంట, నాలుగు మోటార్లను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. గతంలో పగలంతా తోటల్లో ఉంటూ సాయంత్రం వేళల్లోనే గజరాజులు పొలాల్లోకి వచ్చేవి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా అవి సంచరిస్తుండడంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గజరాజుల సమాచారం తెలుసుకున్న తాలాడ, కీసర, కోసలి గ్రామస్థులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. తక్షణమే వాటిని తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఎండకు తట్టుకోలేక నీటి కోసం బోర్లు ఉన్న సమీపానికి ఏనుగులు చేరుకుంటున్నాయని బీట్‌ ఆఫీసర్‌ దాలినాయుడు తెలిపారు. దీనిపై ప్రజలు, రైతులకు అప్రమత్తం చేస్తున్నామన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:35 PM