Share News

Totapalli Venkanna 5 నుంచి తోటపల్లి వెంకన్న విగ్రహ పునః ప్రతిష్ఠ

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:10 AM

తోటపల్లి వేంకటేశ్వర స్వామి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించేందుకు ఆలయ కార్యనిర్వహణ అధికారి, అభివృద్ధి సేవా ట్రస్టు నిర్ణయించాయి.

Totapalli Venkanna  5 నుంచి తోటపల్లి వెంకన్న  విగ్రహ పునః ప్రతిష్ఠ
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ట్రస్టు సభ్యులు

గరుగుబిల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి వేంకటేశ్వర స్వామి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించేందుకు ఆలయ కార్యనిర్వహణ అధికారి, అభివృద్ధి సేవా ట్రస్టు నిర్ణయించాయి. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధిత పోస్టర్లను కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ విడుదల చేశారు. పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురువులు విద్యాశంకర భారతీస్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. 5, 6, 7 తేదీలలో ప్రతిష్ఠ కార్యక్రమాలు, 8న వార్షిక కల్యాణోత్సవం ఉంటుందని వివరించారు. ఇదిలా ఉండగా గిజబ గ్రామానికి చెందిన ప్రసాద్‌.. కలెక్టర్‌ చేతులమీదుగా ట్రస్ట్‌ కోశాధికారి తామడ దుర్గారావుకు లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి ఆలయ అభివృద్ధి సేవా ట్రస్టు సభ్యుడు డి.పారినాయుడు, కన్వీనర్‌ శ్రీరామచంద్రమూర్తి, కో మేనేజింగ్‌ ట్రస్టీ చుక్క భాస్కరరావు, ట్రస్టీలు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:11 AM