award ‘గ్రీన్‌స్కూల్’గా రేగిడి విద్యాలయం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:29 PM
Regidi Vidyalayam as a 'Green School' నేషనల్ గ్రీన్‌కార్ప్స్‌లో భాగంగా రేగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌స్కూల్ అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్రంలో 16 పాఠశాలలు ఈ అవార్డుకు ఎంపిక కాగా వాటిలో విజయనగరం జిల్లా నుంచి రేగిడి హైస్కూల్ ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం వి.లక్ష్మణరావు, సైన్స్ ఉపాధ్యాయిని బి.ఉమామహేశ్వరి తెలిపారు.

‘గ్రీన్‌స్కూల్’గా రేగిడి విద్యాలయం
కేంద్రప్రభుత్వ అవార్డుకు ఎంపిక
ఫిబ్రవరి 4న ఢిల్లీలో ప్రదానం
రేగిడి, జనవరి 17, (ఆంరఽఽధజ్యోతి): నేషనల్ గ్రీన్‌కార్ప్స్‌లో భాగంగా రేగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌స్కూల్ అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్రంలో 16 పాఠశాలలు ఈ అవార్డుకు ఎంపిక కాగా వాటిలో విజయనగరం జిల్లా నుంచి రేగిడి హైస్కూల్ ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం వి.లక్ష్మణరావు, సైన్స్ ఉపాధ్యాయిని బి.ఉమామహేశ్వరి తెలిపారు. కొంతకాలంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కలిసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పాటిస్తూ పర్యావరణ హిత కార్యక్రమాలు విరివిగా చేపడుతున్నారు. స్వచ్ఛతా సేవా, గ్రామంలో మొక్కలు నాటడం, విత్తన గణపతి ఏర్పాటు, మట్టి విగ్రహాల పంపిణీ, గుడ్డ సంచుల పంపిణీ, జీవకుండీల తయారీ, డిస్పోజబుల్‌కు బదులుగా చిరు ఽధాన్యాల పాత్రలు, ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్, ఇంకుడు గంతుల నిర్వహణ, హరిత దీపావళి సంబరాలు, పాఠశాలలో గ్రీన్‌బెల్ట్ అంశాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఈ అంశాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌స్కూల్ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డు అందుకునేందుకు ఫిబ్రవరి 4న సైన్స్ ఉపాధ్యాయిణి ఉమామహేశ్వరి ఢిల్లీ వెళ్లనున్నారు. డీఈవో మాణిక్యంనాయుడు, డిప్యుటీ డీఈవో మోహనరావు, మండల విద్యాశాఖాధికార్లు ఎంవీ వరప్రసాదరావు, బి.ఎరకయ్యలు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.