Share News

Republic Day Celebrations గణతంత్ర వేడుకలకు సిద్ధం

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:43 PM

Ready for Republic Day Celebrations గణతంత్ర వేడుకలకు జిల్లాకేంద్రం ముస్తాబైంది. దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ కార్యాలయాన్ని విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

 Republic Day Celebrations గణతంత్ర వేడుకలకు సిద్ధం
గణతంత్ర వేడుకులకు సిద్ధమైన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం

పార్వతీపురం/బెలగాం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకలకు జిల్లాకేంద్రం ముస్తాబైంది. దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ కార్యాలయాన్ని విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కాగా ఆదివారం కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. పోలీస్‌ దళాల వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరించనున్నారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు , శకటాలు, ప్రదర్శన శాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 487 మందికి ప్రశంసాపత్రాలు అందించనున్నారు. జేసీ శోభిక, పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు అశుతోష్‌ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌, డీసీ హెచ్‌వో వాగ్దేవి, డ్వామా పీడీ రామచంద్రరావు, జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌, ఏఏవో ప్రసాద్‌ తదితరులు జ్ఞాపికలు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి , జిల్లా అధికారులు పాల్గొనున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:43 PM