near railway station పక్కనే రైల్వేజోన్
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:33 AM
railway zone at beside విశాఖ పర్యటనలో ప్రధాన మోదీ శంకుస్థాపన చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు పూర్తయితే జిల్లా అభివృద్ధిలోనూ ఎన్నో మలుపులు రానున్నాయి. మౌలిక సౌకర్యాలు మెరుగు పడనున్నాయి. జిల్లా మీదుగా వెళ్లే రైళ్లు పెరగనున్నాయి. హాల్టులు కూడా పెరుగుతాయి. ఈ సౌకర్యాలతో కొత్త కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా జిల్లాకు పక్కనే రైల్వేజోన్ ఉండడం వల్ల ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. పర్యాటకం దశ మారొచ్చు. అభివృద్ధికి అనేక అవకాశాలు సమకూరనున్నాయి.
పక్కనే రైల్వేజోన్
జిల్లాలో ఎన్నో మార్పులు
అభివృద్ధికి అవకాశాలు
జిల్లా మీదుగా పెరగనున్న రైళ్లు, హాల్టులు
విశాఖ పర్యటనలో ప్రధాన మోదీ శంకుస్థాపన చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు పూర్తయితే జిల్లా అభివృద్ధిలోనూ ఎన్నో మలుపులు రానున్నాయి. మౌలిక సౌకర్యాలు మెరుగు పడనున్నాయి. జిల్లా మీదుగా వెళ్లే రైళ్లు పెరగనున్నాయి. హాల్టులు కూడా పెరుగుతాయి. ఈ సౌకర్యాలతో కొత్త కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా జిల్లాకు పక్కనే రైల్వేజోన్ ఉండడం వల్ల ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. పర్యాటకం దశ మారొచ్చు. అభివృద్ధికి అనేక అవకాశాలు సమకూరనున్నాయి.
విజయనగరం/ కలెక్టరేట్, జనవరి 8(ఆంధ్రజ్యోతి):
ప్రధానమంత్రి మోదీ విశాఖ జిల్లా పర్యటనపై జిల్లా ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కీలకంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తున్నారు. ఎంత తొందరగా జోన్ కార్యాలయ నిర్మాణం పూర్తయితే అంతే వేగంగా జిల్లా ప్రగతిలో మార్పులు వస్తాయనేది సీనియర్ సిటిజన్ల మాట. పారిశ్రామికంగా.. పర్యాటకంగా.. మౌలిక సదుపాయాల అభివృద్ధి పరంగా కొత్త మార్పులు వస్తాయంటున్నారు. జిల్లా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మరింత వెనుకబడింది. వలసలు పెరిగాయి. పరిశ్రమలు పడకేశాయి. జూట్, ఫెర్రో పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి వైపుగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేజోన్ కూడా కొత్త జవసత్వాలు కూటగట్టుకునేందుకు దోహద పడనుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. పర్యాటకం కొత్తబాట పట్టనుంది. జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు పెరుగుతాయి. వాటి హాల్టులు కూడా పెరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ మరింత విస్తరించనుంది.
- జిల్లా పర్యాటక రంగంలో తప్పనిసరిగా మార్పులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాటిపూడి, రామతీర్థం, భోగాపురం బీచ్, విజయనగరం మహారాజుల కోట సందర్శనతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాఽధ్యదైవం పైడితల్లి, నెల్లిమర్లలోని దిబ్బేశ్వర ఆలయం, పుణ్యగిరి వంటి దేవాలయాలకు పర్యాటకుల సంఖ్య పెరగనుంది. జాతీయ రహదారుల విస్తరణతోపాటు కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే విశాఖపట్టణం నుంచి రాయపూర్ వరకూ సాగుతున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి.
పార్లమెంట్‌లో పదేళ్లు పోరాడా
రామ్మోహన్‌నాయుడు, కేంద్ర విమానయాన మంత్రి
గత పదేళ్లు నేను సభ్యుడిగా విశాఖ రైల్వే జోన్ కోసం పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ పోరాడాను. ఎన్నోదఫాలు కేంద్రప్రజాప్రతినిధులకు వినతి ఇవ్వడమేకాకుండా... రైల్వేజోన్ ఆవశ్యకతను.. ఉత్తరాంధ్రకు ఏళ్లతరబడి జరుగుతున్న నష్టాన్ని వివరించాను. ఇప్పటికి రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితోపాటుగా నేను కేంద్రమంత్రిగా పాల్గొనడం.. అదీ ఉత్తరాంధ్రకు మేలు కలిగే ‘విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం’ నిర్మాణం కోసం పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.