ఉరి తాళ్లతో నిరసన
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:22 AM
మండలంలో నాగావళి నదిపై పూర్ణపాడు - లాబేసు గ్రామాల మధ్య వంతెన పనులను తక్షణమే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

కొమరాడ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలో నాగావళి నదిపై పూర్ణపాడు - లాబేసు గ్రామాల మధ్య వంతెన పనులను తక్షణమే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి, తదితరులు గురువారం నాగావళి నదిలో దిగి.. మెడకు ఉరి తాడు బిగించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి తూర్పు వైపున ఉన్న 32 గిరిజన గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి రావాలంటే నది దాటి రావలసిన పరిస్థితి ఉందన్నారు. ఇటువంటి తరుణంలో ఈ వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరారు.