చెరువు కబ్జాను అడ్డుకోవాలి
ABN , Publish Date - Feb 16 , 2025 | 12:12 AM
రామభ ద్రపురం మండలంలోని కొట్టక్కి జాతీయ రహదారి పక్కన చెరువును కబ్జా చేసే పనులు అడ్డుకోవాల ని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మే రకు శనివారం బొబ్బిలి ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మో హనరావుకు వినతిపత్రం అందజేశారు.
బొబ్బిలి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రామభ ద్రపురం మండలంలోని కొట్టక్కి జాతీయ రహదారి పక్కన చెరువును కబ్జా చేసే పనులు అడ్డుకోవాల ని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మే రకు శనివారం బొబ్బిలి ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మో హనరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా సీపీఎం నేత శంకరరావు మాట్లాడుతూ సర్వేనెంబరు 431-5లో గల సుమారు ఎకరా కోనేరును ఆక్ర మించుకున్నారని, దీనిని పూడ్చివేసి చదును చేసే పనులు చేపట్టారని తెలి పారు. ఆక్రమణలకు సంబంధించి గతంలో అనేక పోరాటాలు జరిగాయని, తహసీల్దారు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ ఫిర్యాదులు వెళ్లాయని చెపాపరు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహసీల్దారు నోటీసు ఇచ్చారని తెలిపారు. ఏడాది గడిచిన తరువాత మళ్లీ చెరువును గ్రావెల్‌తో నింపి రోడ్లు వేస్తున్నారని, ప్లాట్లుగా అమ్ముకునే ఏర్పాటు చేశారన్నారు. పక్కా జాతీయరహదారిని ఆనుకొని ఉన్న చెరువును కబ్బా చేసేస్తుంటే రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు చోద్యం చూస్తున్నాయని ఆరో పించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బలస శ్రీనివాసరావు, ఎస్.గో పాలం, ఎ.సురేష్, యుగంధర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు అరికట్టాలి
రామభద్రపురం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలను రెవెన్యూ అధికారులు అరికట్టాలని బొబ్బిలి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి, జిల్లా జనసేన నాయకులు మహం తి ధనంజయరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొట్టక్కి గ్రామ పరిధిలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ చేస్తున్నారని పేర్కొని ఆ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్రమణలపై గతంలో తాము పోరాలు చేశామని, మళ్లీకొంతమంది ఈ స్థలాలను ఆక్రమిస్తున్నారని తెలిపారు. ఆక్రమణలు నిరోఽ దించకపోతే కోర్టుకు వెళతామని చెప్పారు.