కోడిపందేల శిబిరాలపై పోలీసుల దాడి
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:48 PM
జిల్లాలో రెండుచోట్ల నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరాలపై పోలీసులు గురువారం దాడి చేశారు.

చీపురుపల్లి/నెల్లిమర్ల, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండుచోట్ల నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరాలపై పోలీసులు గురువారం దాడి చేశారు. కోడిపుంజులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామ సమీపంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ ఎల్.దామోదరావు తన సిబ్బందితో వెళ్లి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 6 కోడి పుంజులు, రూ.15280 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఫ నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లిలోని చెరువు పక్కన కోడిపందే లు ఆడుతున్న నలుగురు వ్యక్తులను నెల్లిమర్ల ఎస్‌ఐ బి.గణేష్ అరెస్టు చేశారు. వారి నుంచి 3 కోడి పుంజులు, రూ.1510 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.