చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:33 AM
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు.

సీతానగరం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని గెడ్డలుప్పి గ్రామానికి చెందిన సొంగల కృష్ణమూర్తి(50) అనారోగ్యంతో బాధపడుతూ, బాధను తట్టుకో లేక శనివారం పురుగు మందు తాగి ఆత్మహ త్యా ప్రయత్నం చేసుకున్నాడు. విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.