Share News

snow: మంచు దుప్పట్లో మన్యం

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:54 PM

snow:: జిల్లాలో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలై మరుసటి రోజు ఉదయం 9 వరకు వదలడం లేదు.

 snow: మంచు దుప్పట్లో మన్యం
వీరఘట్టంలో దట్టంగా కురుస్తున్న పొగమంచు

- పంటలకు తీవ్ర నష్టం

- ప్రయాణికులకు తప్పని పాట్లు

- మరోపక్క వణికిస్తోన్న చలి

పాలకొండ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలై మరుసటి రోజు ఉదయం 9 వరకు వదలడం లేదు. గత 15 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. మరోపక్క చలి తీవ్రత కూడా అధికంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతల 18 డిగ్రీల నుంచి 16 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్ని వస్త్రాలు, రగ్గులు, స్వెర్టర్లు ధరించి చలి నుంచి రక్షణ పొందుతున్నారు. పొగమంచుతో చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నా రు. మంచు కురిసే సమయంలో వారు బయ టకు రాకూడదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.


పంటలపై తీవ్ర ప్రభావం..

పొగ మంచు జిల్లా రైతాంగాన్ని నిలువునా ముంచేస్తుంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలతో మినుము, పెసర, మొక్కజొన్న పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. మిగిలిన పంట ఇప్పుడు పొగమంచు కారణంగా నాశనమవుతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో మినుము, పెసర సాగవుతున్నాయి. ప్రస్తుతం ఈ పంటలు పిందె, కాయ దశలో ఉన్నాయి. మంచు వల్ల పిందెలు, కాయలపై నల్లని మచ్చలు వస్తున్నా యి. మొక్కలు సైతం పాలిపోతున్నాయి. ఆకులకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. పురుగు మందులు వినియోగించి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ పంట సగానికి నష్టపోయే ప్రమాదముందని రైతులు చెబుతున్నారు. అదే విధంగా మామిడి, జీడిమామిడి పూత మాడిపోతుం దని ఆవేదన చెందుతున్నారు. సీతంపేట, భామిని, వీరఘట్టం, పాలకొండ, జీఎల్‌పురం, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, పార్వతీపురం, సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో జీడి, మామిడి పంటలపై ఈ ప్రభావం కనిపి స్తుందని వాణిజ్య రైతులు పేర్కొంటున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:54 PM