Share News

కొనసాగుతున్న నియామక ప్రక్రియ

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:21 AM

జిల్లా కేం ద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో స్టైఫండరీ పోలీసు కానిస్టే బుల్స్‌ ఉద్యోగ నియామక ప్రక్రియకు తొమ్మిది రోజూ కొనసా గింది.

 కొనసాగుతున్న నియామక ప్రక్రియ

విజయనగరం క్రైం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో స్టైఫండరీ పోలీసు కానిస్టే బుల్స్‌ ఉద్యోగ నియామక ప్రక్రియకు తొమ్మిది రోజూ కొనసా గింది. శుక్రవారం 600 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 408 మంది అభ్యర్థులు మాత్రమే హాజర య్యారు. హాల్‌ టికెట్లను పరిశీలించి పీఎంటీ, పీఈటీ పరీక్షలకు అనుమతించారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌, ఏఎస్పీ సౌమ్యలత, జి.నాగేశ్వరరావు ప్రక్రియను పర్యవేక్షించారు. ఆధునిక సాంకేతి క నైపుణ్యం కలిగిన డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌ను వినియోగించి అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలు నిర్ధారించి పీఈటీ, పీఎంటీ పరీక్షలకు అనుమతించారు. నియామక ప్రక్రియలో డీఎస్పీలు వీరకుమార్‌, యూనివర్స్‌, బాపూజీ, శ్రీనివాసరావు, థామస్‌రెడ్డి, ఏవో శ్రీనివాసరావుతో పాటు పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:21 AM