Share News

cock rate ఒక్కోటి లక్ష!

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:51 PM

One lakh each! సంక్రాంతి పండుగ వచ్చిందంటే పందెంకోళ్లు గుర్తుకొస్తాయి. జిల్లాలో అక్కడక్కడే కోడి పందేలు ఆడుతున్నప్పటికీ వాటి పెంపకం.. విక్ర యాలు జోరుగా జరుగుతాయి. వేల నుంచి లక్ష రూపాయల వరకు కోళ్ల ధర పలుకుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఈ ఏడాది కూడా పందెం కోళ్ల విక్రయాలు జోరందుకున్నాయి. సంక్రాంతి సమీపించడంతో దాదాపు చివరి దశకు చేరాయి.

 cock rate ఒక్కోటి లక్ష!
అమ్మకానికి పందెం కోళ్లు

ఒక్కోటి లక్ష!

పందెం కోళ్లకు విపరీతమైన డిమాండ్‌

భోగాపురం ప్రాంతంలో అమ్మకాలు

భోగాపురం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వచ్చిందంటే పందెంకోళ్లు గుర్తుకొస్తాయి. జిల్లాలో అక్కడక్కడే కోడి పందేలు ఆడుతున్నప్పటికీ వాటి పెంపకం.. విక్ర యాలు జోరుగా జరుగుతాయి. వేల నుంచి లక్ష రూపాయల వరకు కోళ్ల ధర పలుకుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఈ ఏడాది కూడా పందెం కోళ్ల విక్రయాలు జోరందుకున్నాయి. సంక్రాంతి సమీపించడంతో దాదాపు చివరి దశకు చేరాయి.

తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కడున్నా, ఇతర దేశాల్లో ఉన్నా సంక్రాంతి పండుక్కి తప్పకుండా స్వగ్రామాలకు వచ్చి తీరుతారు. అంతే కాదు పండుగ పేరుతో నిర్వహించే కోడిపందేలు తిలకించేందుకు ఆసక్తి చూపుతారు. అందుకే సంక్రాంతి రోజుల్లో పందెం కోళ్లకు ఎక్కడా లేని గిరాకీ ఉంటుంది. పందేలపై నిషేధం ఉన్నా కూడా చాలా ప్రాంతాల్లో కోడి పందేలను గుట్టుగా నిర్వహిస్తుంటారు. ఇతర ప్రాంతాల్లో కూడా డిమాండ్‌ ఉండడంతో ఏటా భోగాపురం చుట్టు పక్కల గ్రామాల్లో పందెం కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు. అధిక మదుపుపెట్టి పుష్టిగా తయారు చేస్తున్నారు. ధర కూడా అధికంగానే ఉంటోంది. దాదాపు రూ.లక్ష పలికిన కోళ్లు కూడా ఉన్నాయి. పందెం కోళ్ల పెంపకానికి సంబంధించి గుడ్లు పొదిగించి వాటిలో సరైన కోడి పిల్లలను ఎంపిక చేసి పందెంకు తయారు చేయడానికి సుమారు రెండేళ్ల సమయం పడుతుంది. వీటికి ప్రతిరోజూ రాగులు, గంటెలు, ధాన్యం, బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా, మాంసం కైమా ఆహారంగా పెడతారు. అలాగే పరుగెత్తించడం, ఈత కొట్టించడం నేర్పిస్తారు. ప్రతిరోజూ కఫం తీస్తారు. వీటి రెట్టను పరిశీలిస్తూ మందులు కూడా వేస్తారు. ఈవిధంగా రెండు సంవత్సరాల పాటు పందెం కోడిని పెంచుతారు. ఇక్కడ పచ్చకాకి, నెమలి, కోడిరసంగి, కోడిఅబ్రాస్‌, చేతువ, ఎర్రడేగ రకాలకు చెందిన పందెంకోళ్లు ఉన్నాయి. భీమవరం, ఒడిశా, విశాఖపట్నం, రణస్థలం, నరవ, ఆరిలోవ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి ఇక్కడ పందెం కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. భోగాపురం ప్రాంతం నుంచి ఇప్పటికే చాలా పందెం కోళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్లిపోయారు.

Updated Date - Jan 06 , 2025 | 11:51 PM