Share News

పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలి

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:20 PM

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో-57ను 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వర్తింపజేసి వారికి పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు బొత్స పద్మావతి డిమాండ్‌ చేశారు.

 పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలి
మాట్లాడుతున్న పద్మావతి :

బొబ్బిలి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో-57ను 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వర్తింపజేసి వారికి పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు బొత్స పద్మావతి డిమాండ్‌ చేశారు. ఆదివారం బొబ్బిలి ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2003 డిసెంబరు 31కి ముందు అప్పట్లో డీఎస్పీ ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వం అలసత్వం వల్ల ఉద్యోగ నియామకాలు 2004లో జరిగాయన్నారు. అలా నియమించిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో వెంటనే దానిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమలు కాని మెమోను, కూటమి ప్రభుత్వం కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఏపీటీఎఫ్‌ అకడమిక్‌ రాష్ట్ర కన్వీనరు జేసీ రాజు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం పరిష్కరించి అమలు చేయాలన్నారు. మధ్యంతర భృతిని ప్రకటించి, 12వ పీఆర్సీ నియమించాలని, ఆర్థిక బకాయిలు క్లియర్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బంకురు జోగినాయుడు, ప్రవీణ్‌కుమార్‌, సింహాచలం, ఎల్లయ్య, శ్రీను, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 11:20 PM