Share News

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:22 AM

గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బలవర్ధకమైన పోషకాహారాన్ని అందిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీవో సుగుణకుమారి తెలిపారు.

 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం
సామూహిక సీమంతాలు నిర్వహిస్తున్న సుగుణకుమారి :

గరుగుబిల్లి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బలవర్ధకమైన పోషకాహారాన్ని అందిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీవో సుగుణకుమారి తెలిపారు. బుధవారం మండలంలోని పెదగుడబ పంచా యతీ సన్యాసిరాజుపేట అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించా రు. కొమరాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి, పెదగుడబ ఐసీడీఎస్‌ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ రౌతు లక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్లు గర్భిణులకు గాజులు, జాకెట్‌ ముక్కలు, పండ్లు, స్వీట్లు అందజేశారు.

Updated Date - Mar 06 , 2025 | 12:22 AM