Share News

Liquor Shops మద్యం షాపులకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:00 AM

Notification for Liquor Shops జిల్లా పరిధిలో నాలుగు రిజర్వ్‌డు కేటగిరీ మద్యం షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి బి.శ్రీనాథుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 Liquor Shops మద్యం షాపులకు నోటిఫికేషన్‌

పార్వతీపురం టౌన్‌, జనవరి 29 : జిల్లా పరిధిలో నాలుగు రిజర్వ్‌డు కేటగిరీ మద్యం షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి బి.శ్రీనాథుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గెజిట్‌ ప్రకారం.. పార్వతీపురం మున్సిపాల్టీ, సాలూరు మండలంలో శ్రీసైన కులస్థులకు, వీరఘట్టం పరిధిలో సెగిడిలకు, పాలకొండలో సొండిలకు మద్యం షాపులను కేటాయించినట్లు పేర్కొన్నారు. అప్లికేషన్‌ ఫీజు రూ.2లక్షలు, 2024-25 సంవత్సరానికి నాలుగు షాపుల యజమానులు లైసెన్స్‌ ఫీజు రూ.21.66 లక్షలు చెల్లించాలన్నారు. 2025-26గాను రూ.35.75 లక్షలు కట్టాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ లోపు అబార్కీ స్టేషన్లలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో గాని, హైబ్రీడ్‌ మోడ్‌లో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 7వ తేదీ ఉదయం 10 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా మద్యం షాపుల కేటాయించనున్నట్లు చెప్పారు.

Updated Date - Jan 30 , 2025 | 12:00 AM