‘చలో విజయవాడ’కు తరలిరండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:08 AM
ఆశా వర్కర్ల సమ స్యలపై ఈనెల 6న చేపట్టనున్న చలో విజయవాడ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయ కుడు పి.శంకరరావు పిలుపునిచ్చారు.

బొబ్బిలి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్ల సమ స్యలపై ఈనెల 6న చేపట్టనున్న చలో విజయవాడ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయ కుడు పి.శంకరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళ వారం స్థానిక సీహెచ్‌సీ ఎదుట ఆశావర్కర్లతో ధర్నా నిర్వహించారు. వేతనాలు పెంచాలని, పనిభారం తగ్గిం చాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, గ్రూపు ఇన్సూరెన్స్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలని, నాణ్యమైన యూనిఫారా లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సీహెచ్‌సీ అధికారికి వినతిపత్రం అందజేశారు.
బాడంగి: ఆశా వర్కర్ల సమస్యలపై ఈనెల 6న చేపడుతున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకర రావు కోరారు. మంగళ వారం స్థానిక ఆశావర్కర్లతో కలిసి సీహెచ్‌సీ వైద్యుడికి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ కార్యదర్శి ఎ.సురేష్, నాయకురాలు శశికళా, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.