Share News

మోటారు పనిచేయక..నిర్వహణకు నోచుకోక

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:22 AM

బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలో గల కోరాడవీధి శివారున (సాదీఖానా) దగ్గరలో ఏర్పాటుచేసిన సామాజిక మరుగుదొడ్లు మో టారు పని చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

 మోటారు పనిచేయక..నిర్వహణకు నోచుకోక
మరుగుదొడ్ల పరిసరాల్లో పిచ్చిమొక్కలు, తుప్పలు పెరిగిన దృశ్యం:

బొబ్బిలి/బొబిలిరూరల్‌, జనవరి 15 (ఆంధ్ర జ్యోతి)::: బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలో గల కోరాడవీధి శివారున (సాదీఖానా) దగ్గరలో ఏర్పాటుచేసిన సామాజిక మరుగుదొడ్లు మో టారు పని చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. కాలనీలో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించాలన్న లక్ష్యంతో నిర్మించిన మరు గుదొడ్లు నిర్వహణపై మునిసిపల్‌ అధికారులు దృష్టి సారించకపోవడంతో వినియోగంలో లేకుండాపోయాయి. మునిసిపల్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మరుగుదొడ్లు చుట్టూ పిచ్చిమొక్కలు, డొంకలు, తుప్పలు పెరిగి పోయాయి. ఈనేపథ్యంలో పరిసరాలు అధ్వా నంగా మారడంతో కోరాడవీధి వాసులు రోడ్లు, కాలువలపై బహిరంగ మలవిసర్జన చేస్తు న్నారు. చీకటిపడిన తర్వాత ఆరుబయ టకు వెళ్లడానికి మహిళలు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోటారు కు మరమ్మతులుచేసి మరుగుదొడ్ల పరి సరాల్లో శుభ్రంచేసి వినియోగంలోకి తీసుకురా వాలని పలువురు కోరుతున్నారు. కాగా మరు గుదొడ్లకుసంబంధించిన మోటర్‌ పనిచేయడం లేదని ఏఈ దృష్టికి తీసుకువెళ్లినట్లు శాని టరీ ఇన్‌స్పెక్టర్‌ మురళి తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 12:22 AM