Share News

Establishing Industries పరిశ్రమల స్థాపనకు చర్యలు

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:05 AM

Measures for Establishing Industries ప్రధానమంత్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ కింద జిల్లాలో కుటీర ఆహార పరిశ్రమల యూనిట్ల స్థాపనకు క్లస్టర్లను గుర్తించాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు.

  Establishing Industries పరిశ్రమల స్థాపనకు చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ కింద జిల్లాలో కుటీర ఆహార పరిశ్రమల యూనిట్ల స్థాపనకు క్లస్టర్లను గుర్తించాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. పీఎంఎఫ్‌ఈ, ప్రాథమిక రంగాల వృద్ధిపై మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. రైతులు, ఎస్‌హెచ్‌సీ బృందాలు వ్యక్తిగత యూనిట్లు స్థాపించుకు నేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించి దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. సేంద్రియ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో 58 శాతం నీటి వనరులు ఉన్నాయని, మత్స్య సంపద వృద్ధికి ‘మన్యం’ అనుకూలమని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్థక శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:05 AM