వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:47 PM
వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పాచిపెంట మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

సాలూరు/పాచిపెంట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పాచిపెంట మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై పాచిపెంట ఎస్‌ఐ వెంకటసురేష్ శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాచిపెంటకు చెందిన సుంకరి వెంకట రావుకు అదే గ్రామానికి చెందిన నీలిమ(32)తో సుమారు 14 ఏళ్ల కిందట వివాహం అయ్యింది. వీరికి హరిప్రియ, కీర్తన అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కొన్ని నెలలుగా ఈ భార్యభర్తలు ఇద్దరూ మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల మళ్లీ కలిశా రు. ఈనేపథ్యంలో నీలిమ గురువారం రాత్రి తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.