నిర్వహణ లేక.. వినియోగానికి నోచుకోక
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:47 PM
మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు వినియోగించే చెత్త సేకరణ వాహనాలు నిర్వహణ లేకపోవడంతో మూలకు చేరుతున్నాయి. చిన్నపాటి మరమ్మతులుచేసి వినియో గంలోకి తీసుకొచ్చే అవకాశమున్నా అధికారులుచర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలొస్తున్నాయి.

బొబ్బిలిరూరల్, జనవరి 16 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు వినియోగించే చెత్త సేకరణ వాహనాలు నిర్వహణ లేకపోవడంతో మూలకు చేరుతున్నాయి. చిన్నపాటి మరమ్మతులుచేసి వినియో గంలోకి తీసుకొచ్చే అవకాశమున్నా అధికారులుచర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలొస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని పంచాయతీల్లో చెత్త తరలించే బ్యాటరీ వాహనాలు, మూడు చక్రాల చెత్త సైకిళ్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో చెత్త తరలించడానికి ఈ వా హనాలు పంచాయతీలకు ఎంతగానో ఉప యోగపడేవి. అయితే ప్రభుత్వం మార డం, నిర్వహణ లేక ఈ వాహనాలు మూ లకు చేరాయి. పెంట, తదితర గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు వినియోగించే వాహనాలు మరమ్మతులకు నోచుకోక పోవడంతో రోడ్లపై నిరుపయోగంగా పడిఉన్నాయి. మరమ్మతులకోసం సచివాలయంలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేద సిబ్బంది చెబుతున్నారు. తమకు వేతనాలు కూడా చెల్లించడం లేదని వాపోతున్నారు. కాగా ఎస్సీ కార్పొ రేషన్ నిధులతో అందుబాటులోకి తీసు కొచ్చిన వాహనానికి డ్రైవర్ సరిగా నిర్వ హణ చేయకపోవడంతో మూలకు చేరిం దని పెంట గ్రామ సచివాలయ కార్యదర్శి రవీంద్ర తెలిపారు.