Mistakes పొరపాట్లుకు తావివ్వరాదు
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:17 AM
Leave No Room for Mistakes ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లుకు తావివ్వరాదని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖాధికారులతో సమీక్షించారు.

పార్వతీపురం రూరల్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లుకు తావివ్వరాదని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. పాఠశాలల విలీన ప్రక్రియ విధానంతో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖాధికారులు నిబంధనల మేరకు క్లస్టర్ స్కూల్స్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే రూపొందించిన నివేదికను పునఃపరిశీలన చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. విలీన ప్రక్రియతో విద్యార్థుల్లో సామాజిక అంతరాలు తొలగాలని, విద్యా వ్యవస్థ మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అనీమియా, బరువు, హెచ్‌బీ వివరాలను గ్రేడ్ విధానంలో విభజించి బంగారు భవిత కార్డులో పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. రక్తహీనత నివారణకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శోభిక, డీఈవో ఎన్.తిరుపతినాయుడు, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త తేజేశ్వరరావు, ఉప విద్యాశాఖాధికారులు డి.రాజ్‌కుమర్, పి.కృష్ణమూర్తినాయుడు, ఎంఈవోలు పాల్గొన్నారు.