విద్యార్థులను మోకాళ్లపై నిల్చోబెట్టి..!
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:01 AM
Keeping the students on their knees..! అర్తమూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. హోం వర్కును చేయనందుకు ఓ ఉపాధ్యాయుడు బుధవారం గంటలకొద్దీ పాఠశాల బయట ఎండలో మోకాళ్లపై నిల్చోబెట్టారు.
విద్యార్థులను మోకాళ్లపై నిల్చోబెట్టి..!
ఉపాధ్యాయుడిని నిలదీసిన స్థానికులు
గరివిడి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): అర్తమూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. హోం వర్కును చేయనందుకు ఓ ఉపాధ్యాయుడు బుధవారం గంటలకొద్దీ పాఠశాల బయట ఎండలో మోకాళ్లపై నిల్చోబెట్టారు. దీన్ని గమనించిన స్థానికులు ఉపాధ్యాయుడుని ప్రశ్నించారు. మందలించే తీరు పద్ధతిగా ఉండాలన్నారు. ఈ విషయమై వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. విద్యార్థినులు మోకాళ్లమీద కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డారు. విషయాన్ని ఎంఈవో పి.రామారావు వద్ద ప్రస్తావించగా తన దృష్టికి వచ్చిందని, భవిష్యత్తులో మళ్లీ ఇలా ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని ఉపాధ్యాయుడిని హెచ్చరించానని తెలిపారు.