Share News

ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:21 AM

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతం కంచుకోటగా పేరు పొందిందని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.

ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట

గుర్ల, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతం కంచుకోటగా పేరు పొందిందని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన రెండు గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారిని పార్టీ కండువాలు వేసి ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎస్‌ఎస్‌ఆర్‌.పేట సర్పంచ్‌ వసంత వీరమ్మతో పాటు కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాగోలు సర్పంచ్‌ చందక బంగారునాయుడుతోపాటు పార్టీ కార్యకర్తలు సుమారు 200 మంది టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత రామ్‌మల్లిక్‌ నాయుడు, రాష్ట్ర బీసీసెల్‌ కార్యదర్శి సన్యాసి నాయుడు, నాయకులు కిరణ్‌కుమార్‌, పార్టీ అధ్యక్షులు సీహెచ్‌ మహేశ్వరరావు, రాము నాయుడు, సూర్యనారాయణ, అప్పల నాయుడు, లక్ష్మణరావు, కృష్ణ, శ్రీనివాసరావు, వివిధ గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

న్యాయం చేయండి

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే కళావెంకటరావుకు బాధితులు వినతిపత్రం అందజేశారు. శనివారం మండల కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ మండల స్థాయి అధ్యక్షుడు వల్లూరి చిన్నమనాయుడు తదితరులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

Updated Date - Feb 23 , 2025 | 12:21 AM